బ్రిటన్ రాజు చార్లెస్-3కి క్యాన్సర్
- February 06, 2024
లండన్: బ్రిటన్ రాజు చార్లెస్-3 (75)కి క్యాన్సర్ నిర్థారణైనట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. గత నెల పెరిగిన ప్రొస్టేట్‌కు చికిత్స చేయించుకున్నారని, వైద్య పరీక్షల్లో క్యాన్సర్ వ్యాధి బయటపడినట్లు పేర్కొంది.
అయితే అది ఏరకమైన క్యాన్సర్ అని వెల్లడించలేదు. సోమవారం నుండి చికిత్స తీసుకుంటున్నారని, వైద్యుల సూచన మేరకు ఆయన హాజరయ్యే ప్రత్యేక కార్యక్రమాలను వాయిదా వేసినట్లు తెలిపింది.
క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకే ఆయన తన చికిత్స గురించి ప్రకటించారని చార్లెస్-3 ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం ఆయన అవుట్ పేషెంట్‌గా చికిత్స తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కింగ్ చార్సెస్-3చికిత్సకు సానుకూలంగా స్పందిస్తున్నారని, వీలైనంత త్వరలో సాధారణ విధులకు హాజరవుతారని అన్నారు. క్వీన్ ఎలిజిబెత్-2 మరణానంతరం చార్లెస్ -3 2022 సెప్టెంబర్‌లో బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.
చార్లెస్-3 త్వరగా కోలుకోవాలని పలువురు నేతలు ఆకాంక్షించారు. బ్రిటన్ మాజీ ప్రధానులు లిజ్ ట్రస్, బోరిస్ జాన్సన్, టోనీ బ్లెయిర్లు ఈ మేరకు ట్వీటర్లో పేర్కొన్నారు. త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు అమెరికా ప్రధాని జోబైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోలు ట్వీట్ చేశారు. చార్లెస్-3 త్వరగా కోలుకోవాలని, ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







