దుబాయ్-ఇండియా ప్రయాణంలో పొరబాటు.. భద్రతా ఉల్లంఘన..!
- February 07, 2024
యూఏఈ: ముంబై విమనాశ్రయంలో భారీ భద్రతా ఉల్లంఘన తృటిలో తప్పింది. సోమవారం దుబాయ్ నుంచి ముంబైకి ఎయిర్ విస్తారా విమానంలో వచ్చిన ప్రయాణికులను దేశీయ టెర్మినల్‌కు తీసుకుపోయారు. "ఫిబ్రవరి 4న విస్తారా ఫ్లైట్ యూకే 202లో దుబాయ్ నుండి ముంబైకి చేరుకున్న తమ ప్రయాణికులలో కొందరు, అంతర్జాతీయ టెర్మినల్ కు బదులుగా దేశీయ ప్రయాణికులు రాకపోకలు డొమెస్టిక్ టెర్నినల్ వద్దకు తప్పుగా తీసుకెళ్లబడ్డారు." అని విమాన యాన సంస్థ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. మానవ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగిందని విమానంలో ఉన్న దుబాయ్ వాసి ఒకరు తెలిపారు. "మేము ముంబైకి వచ్చినప్పుడు, ఏరోబ్రిడ్జికి బదులుగా మెట్ల మార్గం ద్వారా వెళ్లాలని సూచించారు. " అని వినయ్ ఆర్ఎస్ చెప్పారు. వెంటనే తాము అధికారులను అప్రమత్తం చేయడంతో పొరపాటు జరిగిందని గ్రహించిన తర్వాత, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సహా అధికారులు దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించారని తెలిపారు. ప్రతి ఒక్కరినీ అంతర్జాతీయ రాకపోకల గేట్‌కు తిరిగి తీసుకెళ్లడానికి బస్సులను ఏర్పాటు చేసారని వినయ్ తెలిపారు. అక్కడ, ప్రతి ఒక్కరూ ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ ద్వారా వెళ్లి సామాను బెల్ట్‌కు వెళ్లినట్లు వివరించారు. ప్రయాణికులు వారి రాక ఫార్మాలిటీలను పూర్తి చేసేందుకు నిర్దేశిత ప్రాంతానికి తీసుకెళ్లేలా తమ బృందాలు సెక్యూరిటీ ఏజెన్సీలు, సంబంధిత అధికారులతో కలిసి పనిచేశాయని ఎయిర్ విస్తారా తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







