1 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకున్న50 ఏళ్ల దుబాయ్ నివాసి
- February 07, 2024
యూఏఈ: 50 ఏళ్ల దుబాయ్ నివాసి బస్సెమ్ ఎల్ టిబి మంగళవారం మజిద్ అల్ ఫుట్టైమ్ (MAF) మాల్స్ నుండి Dh1 మిలియన్ ను గెలుచుకున్నాడు. ఇటీవల ముగిసిన దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ (DSF)లో భాగంగా MAF ద్వారా ‘బిగ్గెస్ట్ ప్రైజ్ ఆఫ్ ది ఇయర్’ డ్రాలో అతను విజేతగా నిలిచాడు. ఈసందర్భంగా బాసెమ్ మాట్లాడుతూ.. ఈసారి షాపింగ్‌లో పాల్గొనడం లేదని, భారీ బహుమతి డబ్బును తెలివిగా ఖర్చుపెడతానని తెలిపారు. బహుమతిలో కొంత మొత్తంతో ఆస్తిని కొనుగోలు చేస్తానని, మిగిలినది పాలస్తీనాలోని యుద్ధబాధితులకు విరాళంగా అందజేస్తానని లెబనాన్‌కు చెందిన బ్రిటీష్ పౌరుడు బస్సెమ్ తెలిపారు. మిలియనీర్ ప్రచారం డిసెంబర్ 8 నుండి జనవరి 14 వరకు సాగింది. ఈ బహుమతిని దుబాయ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం అందజేసింది. మాల్ ఆఫ్ ఎమిరేట్స్‌లోని సిటీ సెంటర్ మిర్డిఫ్, సిటీ సెంటర్ దీరా, సిటీ సెంటర్ మెయిసెమ్ మరియు సిటీ సెంటర్ అల్ షిందాఘలలోని స్టోర్‌లో కనీసం Dh300 ఖర్చు చేసిన వారి నుంచి విజేతను ఎంపిక చేసారు.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







