27 మిలియన్లకు చేరుకున్న విదేశీ పర్యాటకుల సంఖ్య: సౌదీ పర్యాటక మంత్రి
- February 07, 2024
రియాద్: 2023 సంవత్సరంలో 27 మిలియన్ల విదేశీ పర్యాటకులు సౌదీ అరేబియాకు చేరుకున్నారని సౌదీ పర్యాటక మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ తెలిపారు. విజన్ 2030లో భాగంగా 150 మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందులో దేశీయంగా 80 మిలియన్లు, విదేశాల నుండి 70 మిలియన్లు అని చెప్పారు. మంగళవారం రియాద్‌లో పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ నిర్వహించిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ మరియు ప్రైవేట్ సెక్టార్ ఫోరమ్ రెండవ ఎడిషన్‌లో అల్-ఖతీబ్ పాల్గొని ప్రసంగించారు. టూరిజం డెవలప్‌మెంట్ ఫండ్ ఏర్పాటైనప్పటి నుంచి 35 బిలియన్ డాలర్ల విలువైన ఆర్థికసాయం అందించిందని ఆయన చెప్పారు. ప్రైవేట్ రంగం 75,000 హోటల్ గదులను ఏర్పాటు చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకుందన్నారు. సౌదీ అరేబియా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మరియు ఈ కీలక రంగంలోకి పెట్టుబడులను ఆకర్షించడానికి ఉద్దేశించిన ప్రధాన ప్రాజెక్టుల అమలును విస్తరిస్తున్నట్లు అల్-ఖతీబ్ గత నెలలో వెల్లడించారు. రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ఫోరమ్ కు హాజరైన మంత్రి.. సౌదీ అరేబియా 2030 నాటికి 150 మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షించాలని ఆకాంక్షిస్తున్నట్లు, పర్యాటక రంగం జాతీయ ఆర్థిక వ్యవస్థకు SR750 బిలియన్ల సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. 2023 సంవత్సరంలో సౌదీ అరేబియా సాధించిన పర్యాటకుల సంఖ్య 2019తో పోలిస్తే 156 శాతం పెరిగిందని, మహమ్మారి ప్రభావం నుండి ప్రపంచవ్యాప్తంగా కోలుకునే రేటును 88 శాతం మించిందని మంత్రి వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







