పి.వాసు వారసుడు 'శివలింగ' చిత్రం లో...
- June 01, 2016
సీనియర్ దర్శకుడు పి.వాసు వారసుడు శక్తి 'చిన్నతంబి' చిత్రంతో బాలనటుడిగా ఇండస్ర్టీకి పరిచయమయ్యాడు. అనేక చిత్రాల్లో బాలనటుడిగా అలరించిన అనంతరం పి.వాసు తెరకెక్కించిన 'తొట్టాల్ పూ మలరుమ్' చిత్రం ద్వారా శక్తిని హీరోగా ఆరంగేట్రం చేశాడు. అయితే హీరోగా శక్తి కెరీర్ ఆశించినట్టుగా సాగలేదు. కొంతకాలం నటనకు దూరంగా వున్నాడు కూడా. ఈ మధ్యే శక్తివేల్ వాసుగా పేరు మార్చుకున్నాడు. ఈ నేపథ్యంలో తన తండ్రి దర్శకత్వంలో మరోసారి నటించబోతున్నాడు శక్తి. కన్నడంలో ఘన విజయం సాధించిన 'శివలింగ' చిత్రాన్ని తమిళంలో లారెన్స్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఇందులో రెండో హీరోగా శక్తి నటించనున్నాడు.తన వారసుడ్ని నటుడిగా నిలబెట్టాలన్న లక్ష్యంతోనే ఈ పాత్రకు శక్తిని తీసుకున్నట్లు సమాచారం. కాగా, శక్తి ప్రస్తుతం '7నాట్కల్', 'దుర్యోదన' చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







