అఫీషియల్ అప్డేట్.! ‘ఓజీ’ వచ్చేస్తున్నాడహో.!
- February 07, 2024
పవన్ కళ్యాణ్ సినిమాలు ఇప్పట్లో రావడం కష్టమే అనుకున్నారంతా. కానీ అది తప్పని తేలిపోయింది. అసలు పవన్ సినిమాల పరిస్థితేంటీ.? పూర్తయ్యే అవకాశమే కనిపించడం లేదు. ఇక రిలీజ్ సంగతేంటి.? అని డైలమాలో పడిపోయిన వారికి ‘ఓజీ’ రూపంలో కాస్తంత ఊరట లభించింది.
సుజిత్ దర్శకత్వంలో ‘ఓజీ’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మారిన పొలిటికల్ ఈక్వేషన్స్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకపోవడంతో ఆగిపోయిందన్న ప్రచారం జరిగింది.
అయితే, ఏం జరిగిందో ఏమో.! అద్భుతమే జరిగింది. ‘ఓజీ’ మళ్లీ ముందుకు జరిగింది. త్వరలోనే పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయించబోతున్నారట. దాంతో, షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుందట. ఇక, సీజీ వర్క్ పూర్తి చేసి.. సెప్టెంబర్‌లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట.
తాజాగా చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించారు. సెప్టెంబర్ 27న ‘ది హంగ్రీ చీటా ఆగమనం.!’ అంటూ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేస్తూ.. సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. దాంతో, పవన్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతోందిప్పుడు. లాంగ్ వీకెండ్ దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాని ఆ డేట్‌కి ఫిక్స్ చేశారని తెలుస్తోంది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్‌లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









