వాకింగ్‌తో మెదడుకు మసాజ్.!
- February 07, 2024అదేంటీ.! వాకింగ్‌తో మెదడుకు మసాజ్ ఎలా అవుతుంది.. అని ఆశ్చర్యపోతున్నారా.? అవునండీ.. ప్రతీరోజూ వాకింగ్ చేయడం వల్ల బుర్ర సరిగ్గా పని చేస్తుందట.
అదేనండీ.. మెదడు సరిగ్గా పని చేస్తుందట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యాయామం పేరు చెప్పి అనేక రకాల వర్కవుట్లు చేసి కష్టపడిపోతుంటారు చాలా మంది.
కానీ, అన్నింట్లోకెళ్లా వాకింగ్ బెస్ట్ ఎక్సర్సైజ్ అంటున్నారు నిపుణులు. ప్రతీరోజూ క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల అది కూడా రోజులో 4000 అడుగులు వేయడం వల్ల వారికి గుండె పోటు వచ్చే అవకాశాలు చాలా అరుదు అని చెబుతున్నారు.
అందుకు కారణం వాకింగ్ చేయడం వల్ల శరీరం ఆక్సిజన్ని ఎక్కువగా గ్రహిస్తుంది. అలా గ్రహించిన ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోకి చేరి, రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది.
అలాగే, ఊపిరితిత్తుల్లోని అనవసరమైన ట్యాక్సిన్లు, వ్యర్ధాలను బయటికి పంపించేందుకు తోడ్పడుతుంది. రక్త ప్రసరణ బాగా జరగడం వల్ల గుండె పోటుకు ఆస్కారం వుండదు. అలాగే, రక్త ప్రసరణ సక్రమంగా వుండడం వల్ల మెదడు చురుగ్గా పని చేస్తుంది.
తద్వారా మెదడుకు సంబంధించిన ఎలాంటి సమస్యలు తలెత్తవు. ముఖ్యంగా మతి మరుపు సమస్య దరి చేరదని తాజా సర్వేలో తేలింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు