135 రోజుల యుద్ధ విరమణ ప్రతిపాదనపై స్పందించిన హమాస్

- February 08, 2024 , by Maagulf
135 రోజుల యుద్ధ విరమణ ప్రతిపాదనపై స్పందించిన హమాస్

లండన్: ఇజ్రాయెల్ మద్దతుతో కాల్పుల విరమణ ప్రతిపాదనపై పాలస్తీనా స్పందించింది. ఖైదీల బదులుగా బందీలను మార్చుకోవడం, గాజాను పునర్నిర్మించడం వంటి అనేక డిమాండ్లను హమాస్ ఉంచింది. ఇజ్రాయెల్ దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని మరియు మూడు 45 రోజుల సంధి దశల తర్వాత యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటోంది. మరోవైపు  ఈ ప్రతిపాదన ఆమోదయోగ్యం కాదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి భావిస్తున్నారట. కాగా, ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి మధ్యేమార్గాన్ని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  మొదటి 45 రోజుల పోరాటంలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ మహిళలు, 19 ఏళ్లలోపు పురుషులు, వృద్ధులు మరియు జబ్బుపడినవారు ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్ మహిళలు, పిల్లలకు బదులుగా మార్చుకోవాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దళాలు గాజాలోని జనావాస ప్రాంతాల నుండి ఉపసంహరించుకుంటేనే ఆసుపత్రులు, శరణార్థి శిబిరాల పునర్నిర్మాణం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రతిపాదనకు అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ స్పందించారు. ఇది "కొంచెం టఫ్ " అని భావిస్తున్నారట. అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంథోనీ బ్లింకెన్ మాట్లాడుతూ..  శాశ్వత కాల్పుల విరమణను చేరుకోవడానికి ఇంకా చాలా పని చేయాల్సి ఉందని, అయితే శాశ్వత శాంతిని చేరుకోవడం అనేది అవసరం అన్నారు. 2023 నవంబర్‌లో  వారం సంధిలో 240 మంది పాలస్తీనా ఖైదీలతో మార్పిడిలో 100 మంది బందీలను విడిపించారు.కాగా, బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ కుటుంబాలు తమ ప్రియమైనవారి రాక కోసం ఎదురుచూస్తున్నాయి. గాజాలో మిగిలి ఉన్న 130 మందికి పైగా బందీలలో ఐదవ వంతు చనిపోయారని తెలుస్తోంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com