హమద్ పట్టణంలో గర్భిణి పై దాడి చేసిన వీధికుక్కలు
- February 08, 2024
బహ్రెయిన్: బహ్రెయిన్‌లో వీధికుక్కలను నియంత్రించాలని, ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. బుధవారం హమద్ పట్టణంలో గర్భిణిపై వీధికుక్కలు దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది. అనంతరం బాధితురాలు వివరాలను వెల్లడిస్తూ.. తాను హమద్ టౌన్‌లోని ఫార్మసీకి ఎదురుగా ఒక కుక్కను చూశానని, దాని నుంచి తప్పించుకోవడానికి రోడ్డు దాటాలని ప్రయత్నించాను కానీ అదే సమయంలో కుక్క తన కాలుపై దాడి చేసిందన్నారు.
ఆశ్రయం, తక్షణ ప్రభుత్వ చర్యలు
జంతు హక్కుల కార్యకర్తలు ఫాతియా అల్ బస్తాకి, యు వనజా హాత్కాక్ గతంలో వీధి కుక్కలకు ఆశ్రయం కల్పించడం యొక్క ప్రాముఖ్యతను చెప్పారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ జంతువులు తరచుగా ఆత్మరక్షణ కోసం దాడులు చేస్తాయని, ప్రజలు కూడా వీటిని రెచ్చగొట్టవద్దని, వాటి ముందు భయాన్ని ప్రదర్శించవద్దని వారు కోరారు. వీధి కుక్కల జనాభాను నియంత్రించడానికి మరియు వాటికి తగిన ఆశ్రయం కల్పించే చర్యలను అమలు చేయడం ద్వారా ప్రభుత్వం సమస్యను ముందస్తుగా పరిష్కరించాలని మరికొందరు వాదిస్తున్నారు. ఈ సంఘటన జంతువులను రక్షించడానికి సమగ్ర వ్యూహాలను రూపొందించాల్సిన అవసరాన్ని తెలియజేసింది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్‌లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









