గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక..
- February 09, 2024
మీరు గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం తీవ్ర హెచ్చరికను జారీ చేసింది. గూగుల్ క్రోమ్‌లో ఉన్న లోపాల గురించి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) హెచ్చరించింది. వెంటనే స్పందించి గూగుల్ క్రోమ్‌ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. లేకపోతే మీ సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని తెలిపింది. తాజాగా సెర్ట్ ఈ హెచ్చరికను జారీ చేసింది.
గూగుల్ క్రోమ్ ని ఉపయోగిస్తున్న వాళ్ళందరూ లేటెస్ట్ వెర్షన్‌ని తక్షణమే అప్డేట్ చేసుకోవాలని సెర్ట్ సూచించింది. 114.0.5735.350 లేదా ఆ తర్వాతి వెర్షన్లకు అప్డేట్ కావాలని తెలిపింది. అంతకు ముందు ఉండే వెర్షన్లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందట. ఆ వెర్షన్స్‌లో ఎక్స్టెన్షన్లకు డేట్ ఇన్పుట్ లేదని, బ్రౌజ్ చేసేటప్పుడు సమాచారం లీక్ అవుతోందని తెలిపింది. ఇంటర్నెట్ను బ్రౌజ్ చేస్తున్నప్పుడు, ముఖ్యంగా తెలియని, అనుమానాస్పద వెబ్సైట్లను ఓపెన్ చేసినపుడు వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. తెలియని ఐడీల నుంచి వచ్చిన ఈ-మెయిల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
తాజా వార్తలు
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం







