రెండోసారి ఆరోగ్యవంతమైన నగరంగా నిలిచిన ‘సుర్’
- February 11, 2024
సూర్: ఆరోగ్యవంతమైన నగరానికి అంతర్జాతీయ ప్రమాణాలన్నింటినీ పాటించిన నగరంగా సుర్ నిలిచింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూర్ నగరానికి వరుసగా రెండోసారి ఆరోగ్యవంతమైన నగరంగా సుర్ ను గుర్తిస్తూ సర్టిఫికేట్‌ను ప్రదానం చేసింది. సుర్ వలీ మరియు సుర్ హెల్త్ సిటీ కమిటీ ఛైర్మన్ డాక్టర్ హిలాల్ బిన్ అలీ అల్ హబ్సీ మాట్లాడుతూ.. ఈ గుర్తింపు ద్వారా ఇతర నగరాలకు ఆరోగ్యకరమైన నగరాల కార్యక్రమంలో చేరడానికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. గత నవంబర్‌లో డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి బృందం రెండవసారి సుర్ హెల్త్ సిటీని సందర్శించి ఆరోగ్యాన్ని పెంపొందించే ప్రయత్నాలను ప్రశంసించింది. ఈ అంతర్జాతీయ గుర్తింపు పునరుద్ధరణలో ప్రధాన పాత్ర పోషించిన ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ రంగాల కృషిని కూడా ఆయన అభినందించారు. సుర్ హెల్త్ సిటీ యొక్క కార్యక్రమాలు అయిన గ్రీన్ నగరం; సుర్ సౌక్స్; సాంఘిక సంక్షేమం, మెరీనాస్, సాధికారత మరియు సామర్థ్య నిర్మాణ ఇన్షియేట్, సముద్ర తీరాలు మరియు వాడ్ హెల్త్ విలేజ్ వంటి 14 విభిన్న కార్యక్రమాలను కలిగి ఉన్నాయి. సుల్తానేట్ స్థాయిలో సుర్ హెల్త్ సిటీకి మొదటి గుర్తింపు 2018లో లభించింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







