రోజ్ వాటర్‌తో అందం రెట్టింపు చేసుకోండిలా.!

- February 12, 2024 , by Maagulf
రోజ్ వాటర్‌తో అందం రెట్టింపు చేసుకోండిలా.!

శరీర భాగాలన్నింట్లోనూ అందం పరంగా ముఖానికి ఎక్కువ ప్రాధాన్యత వుంటుంది. అందుకే యువత.. కాదు కాదు ఎవరైనా సరే, ముఖ సౌందర్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంటారు.
ముఖ సౌందర్యానికి అనేక రకాల సౌందర్య లేపనాలు వాడుతుంటారు. మార్కెట్లో లభించే కొన్ని రకాల సౌందర్య లేపనాలూ ముఖానికి హాని చేసే ప్రమాదముంది.
కానీ, రోజ్ వాటర్‌ మాత్రం ముఖం ఆరోగ్యాన్ని రెట్టింపు చేయడంతో పాటూ, అందాన్ని సైతం పెంచుతుంది. కాంతివంతంగా మెరిసిపోయేలా చేస్తుంది.
దీనిలో కెమికల్స్ తక్కువగా వుండి, సహజసిద్ధమైన న్యూట్రియెంట్స్ వుంటాయ్. అందుకే ముఖానికి ఎటువంటి హానీ చేయవు. ఎండలో తిరిగి ఎప్పుడైనా అలసిపోయినట్లుగా అనిపిస్తే.. రోజ్ వాటర్‌లో ముంచిన దూదితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే వాడిపోయినట్లుగా వున్న ముఖం కాంతివంతంగా మారుతుంది.
అలాగే, రోజ్ వాటర్‌లో ముల్తానీ మట్టి కలిపి ముకానికి ప్యాక్‌లా వేసుకుంటే.. ఉష్ణ తాపం వల్ల నల్లగా మారిన ముఖ చర్మం తెల్లగా మారుతుంది. కొత్త కళను సంతరించుకుంటుంది.
అలోవెరా జెల్, రోజ్ వాటర్‌లో మిక్స్ చేసి ముఖానికి పట్టించి పది నిముషాల తర్వాత కడిగేస్తే ముఖంపై వచ్చిన మొటిమలు తొలిగిపోతాయ్. అలాగే, మొటిమల కారణంగా వచ్చే వాపు, నొప్పి కూడా తగ్గుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com