నివేదా థామస్‌కి పెళ్లంట.!
- February 12, 2024
‘జెంటిల్‌మెన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన మలయాళ కుట్టీ నివేదా థామస్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోందట. నేచురల్ యాక్టింగ్‌తో ఆకట్టుకునే నివేదా థామస్‌కి ఈ మధ్య పెద్దగా అవకాశాలేం రావడం లేదు.
సినిమాల్లో అవకాశాలు అంతంత మాత్రమే అయినా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే వుంటుంది నివేదా థామస్. డాన్సింగ్ వీడియోలూ, గట్రా చేస్తూ.. ఏదో ఒక రకంగా ఫాలోవర్స్‌ని హోల్డ్‌లో వుంచుకుంటుంది.
అయితే, నివేదా థామస్ త్వరలో పెళ్లి చేసుకోబోతోందట.. అనే వార్త తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. సినిమా ఫీల్డ్‌కి సంబంధం లేని వ్యక్తితోనే నివేదా పెళ్లి జరుగుతోందట.
ఆయన మరెవరో కాదు, నివేదా థామస్‌కి వరుసకి బావ అవుతాడనీ అంటున్నారు. కెరీర్‌లో బిజీగా వుండి కూడా పలువురు ముద్దుగుమ్మలు ఈ మధ్య పెళ్లి చేసుకుని ఓ వైపు కెరీర్‌నీ, మరోవైపు మ్యారేజ్ లైఫ్‌నీ ఎంజాయ్ చేస్తున్నారు.
అలాంటిది ప్రస్తుతానికి కెరీర్‌లో ఖాళీగానే వున్న నివేదా పెళ్లి చేసుకుంటే తప్పేముంది. మరో మంచి అవకాశమొస్తే.. మళ్లీ సినిమాలు చేసుకోవచ్చు సెకండ్ ఇన్నింగ్స్ పేరు చెప్పి.. అంటూ నెటిజన్లు సైతం నివేదా థామస్‌కి ఉచిత సలహాలిచ్చేస్తున్నారు. అసలింతకీ నిజంగానే నివేదా పెళ్లి చేసుకోబోతోందా.? నిదానంగా తెలియాలి మరి.
తాజా వార్తలు
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్‌ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయం పై సీఎం రేవంత్ ని అభినందించిన ఎంపీలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్







