నివేదా థామస్‌కి పెళ్లంట.!
- February 12, 2024‘జెంటిల్మెన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన మలయాళ కుట్టీ నివేదా థామస్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోందట. నేచురల్ యాక్టింగ్‌తో ఆకట్టుకునే నివేదా థామస్‌కి ఈ మధ్య పెద్దగా అవకాశాలేం రావడం లేదు.
సినిమాల్లో అవకాశాలు అంతంత మాత్రమే అయినా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే వుంటుంది నివేదా థామస్. డాన్సింగ్ వీడియోలూ, గట్రా చేస్తూ.. ఏదో ఒక రకంగా ఫాలోవర్స్‌ని హోల్డ్‌లో వుంచుకుంటుంది.
అయితే, నివేదా థామస్ త్వరలో పెళ్లి చేసుకోబోతోందట.. అనే వార్త తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. సినిమా ఫీల్డ్కి సంబంధం లేని వ్యక్తితోనే నివేదా పెళ్లి జరుగుతోందట.
ఆయన మరెవరో కాదు, నివేదా థామస్‌కి వరుసకి బావ అవుతాడనీ అంటున్నారు. కెరీర్లో బిజీగా వుండి కూడా పలువురు ముద్దుగుమ్మలు ఈ మధ్య పెళ్లి చేసుకుని ఓ వైపు కెరీర్‌నీ, మరోవైపు మ్యారేజ్ లైఫ్‌నీ ఎంజాయ్ చేస్తున్నారు.
అలాంటిది ప్రస్తుతానికి కెరీర్లో ఖాళీగానే వున్న నివేదా పెళ్లి చేసుకుంటే తప్పేముంది. మరో మంచి అవకాశమొస్తే.. మళ్లీ సినిమాలు చేసుకోవచ్చు సెకండ్ ఇన్నింగ్స్ పేరు చెప్పి.. అంటూ నెటిజన్లు సైతం నివేదా థామస్‌కి ఉచిత సలహాలిచ్చేస్తున్నారు. అసలింతకీ నిజంగానే నివేదా పెళ్లి చేసుకోబోతోందా.? నిదానంగా తెలియాలి మరి.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు