నాగార్జునకి జోడీ ఆ సీనియర్ నటి.?
- February 12, 2024
సీనియర్ హీరోయిన్లు ఓ వైపు యంగ్ హీరోయిన్లతో జోడీ కడుతూనే మరోవైపు సీనియర్ హీరోయిన్లతోనూ జోడీ కడుతున్నారు. అందులో మొదటి లిస్టులో వుంటాడు టాలీవుడ్ మన్మధుడు నాగార్జున. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా కోసం ఒకేసారి సీనియర్ నటి రమ్యకృష్ణతోనూ, అలాగే యంగ్ హీరోయిన్ అయిన లావణ్య త్రిపాఠితోనూ ఈక్వెల్‌గా రొమాన్స్ పండించేశారాయన.
ఇప్పుడు నాగార్జున హుషారుగా సినిమాలు చేస్తున్నాడు. లేటెస్ట్‌గా సంక్రాంతికి ‘నా సామిరంగ’ సినిమాతో హిట్టు కొట్టాడు. అదే స్పీడుతో శేఖర్ కమ్ముల సినిమాలో నటిస్తున్నాడు. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నారు.
తాజాగా కొత్త దర్శకుడు సుబ్బుతో ఓ ప్రాజెక్ట్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఓ సీనియర్ నటిని పరిశీలిస్తున్నారట. ప్రియమణి పేరును నాగార్జున ప్రిఫర్ చేసినట్లు తెలుస్తోంది.
గతంలో ‘రగడ’ సినిమా కోసం ప్రియమణి, నాగార్జున స్ర్కీన్ షేర్ చేసుకున్నారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ జంట తెరపై సందడి చేయబోతోందని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై క్లారిటీ రావల్సి వుంది. కానీ, ఇదో సీరియస్ కోర్డు డ్రామా కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న సినిమా అనీ, హీరోయిన్ పాత్రకు హీరోతో పాటూ, ఈక్వెల్ ఇంపార్టెన్స్ వుండబోతోందనీ, ప్రియమణి వంటి సహజ నటికి ఆ స్థానాన్నిస్తే బావువుంటుందని నాగార్జున సూచిస్తున్నారట. చూడాలి మరి, ఏం జరుగుతుందో.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







