బహ్రెయిన్‌లో విజిట్ వీసాలను వర్క్ పర్మిట్‌లుగా మార్చడానికి కొత్త నిబంధనలు

- February 14, 2024 , by Maagulf
బహ్రెయిన్‌లో విజిట్ వీసాలను వర్క్ పర్మిట్‌లుగా మార్చడానికి కొత్త నిబంధనలు

బ‌హ్రెయిన్: స్పాన్సర్ లేకుండా విజిట్ వీసాలను వర్క్ లేదా డిపెండెంట్ వీసాలుగా మార్చడాన్ని అనుమతించబోమని బహ్రెయిన్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. స్పాన్సర్ ఒకే విధంగా ఉంటే సందర్శన వీసాలు పని లేదా డిపెండెంట్ వీసాలుగా మార్చబడతాయని, దాని కోసం రుసుము నాలుగు రెట్లు పెంచిన‌ట్లు తెలిపింది.  BD60గా ఉన్న రుసుము ఇప్పుడు ఒక్కో వీసాకు BD250గా మారిందని  జాతీయత, పాస్‌పోర్ట్‌లు మరియు నివాస వ్యవహారాల (NPRA)లో అంతర్గత మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ షేక్ హిషామ్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ అల్ ఖలీఫా వెల్ల‌డించారు. నేషనల్ లేబర్ మార్కెట్ ప్లాన్‌ను ప్రోత్సహించడానికి,  విజిట్ వీసాల దోపిడీని ఆపడానికి లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) సహకారంతో ఈ విధానాలను తీసుకొచ్చిన‌ట్లు తెలిపారు.        

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com