తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు
- February 14, 2024
దోహా: ఖతార్ నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్రీయ క్రీడ అయిన కబడ్డీ పోటీలను ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఇట్టి పోటీల్లో ఖతర్‌లో నివసిస్తున్న వందకు పైగా తెలుగు కార్మికులు పాల్గొనగా చివరకు జనసేన వారియర్స్ మరియు విజేత వారియర్స్ జట్లు ఫైనల్లో పోటాపోటీగా తలపడగా విజేత వారియర్స్ జట్టు ఛాంపియన్ గా గెలిచింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎ.సి.బి.ఎఫ్ తెలుగు రాష్ట్రాల రిప్రజెంటివ్ సుందరగిరి శంకర్ గౌడ్ విచ్చేశారు శంకర్ గౌడ్ గారు మాట్లాడుతూ స్పోర్ట్స్ డే సందర్భంగా మన రాష్ట్ర క్రీడను నేటి యువతకు ప్రోత్సహిస్తున్నందుకు అభినందించారు.
అనంతరం తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షులు మైదం మధు మాట్లాడుతూ గల్ఫ్ సమితి సేవా కార్యక్రమాలు కాకుండా సాంస్కృతిక క్రీడ కార్యక్రమంలో కూడా ముందుంటుందని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గల్ఫ్ సమితి ఉపాధ్యక్షులు గడ్డి రాజు ప్రధాన కార్యదర్శి సహగిరి వంశి మెంబర్షిప్ సెక్రటరీ గోలి శ్రీనివాస్ ఇన్సూరెన్స్ సెక్రటరీ సాగర్ వెల్ఫేర్ సెక్రెటరీ మనోహర్ చెవుల మధ్య మీడియా మరియు పిఆర్ఓ సెక్రెటరీ సంజీవ్ మరియు అడ్వైజర్ మెంబర్స్ తాళ్లపల్లి ఎల్లయ్య వేములవాడ ఎల్లన్న పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ









