బాసర ఘనంగా వసంత పంచమి వేడుకలు
- February 14, 2024
నిర్మల్: తెలంగాణలోని బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని 108 కలశాల జలాలతో అభిషేకం నిర్వహించారు. పద్మశాలి సంఘం తరుపున ఆందజేసిన చేనేత పట్టువస్త్రాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి సేవలో ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు. ఇక బాసరలో అక్షరాభ్యాసం చేయించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకుని వచ్చారు. తెల్లవారు జామున 3 గంటల నుంచే చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
తాజా వార్తలు
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!







