సౌదీ అరేబియా మరిన్ని స్మార్ట్ ఇండస్ట్రియల్ జోన్లు

- February 15, 2024 , by Maagulf
సౌదీ అరేబియా మరిన్ని స్మార్ట్ ఇండస్ట్రియల్ జోన్లు

రియాద్:  గ్లోబల్ స్మార్ట్ సిటీ ఫోరమ్ 2024 యొక్క మొదటి ఎడిషన్ మంగళవారం రియాద్‌లో ముగిసింది. సౌదీ అరేబియా మరిన్ని స్మార్ట్ ఇండస్ట్రియల్ జోన్‌లను రూపొందించడానికి సిద్ధంగా ఉందని ఫోరంలో వెల్లడించారు. రెండు రోజులపాటు ఫోరమ్‌లో స్మార్ట్ సిటీల భవిష్యత్తు మరియు వాటి మౌలిక సదుపాయాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై అనేక చర్చలు జరిగాయి. స్మార్ట్ ఇండస్ట్రియల్ జోన్ల వల్ల భవిష్యత్‌లో తయారీ, మైనింగ్ రంగాల్లో గొప్ప అవకాశాలు ఉంటాయని ఫోరంలో వక్తలు వెల్లడించారు. రియాద్ అరేనాలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు మున్సిపల్ మరియు గ్రామీణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో సౌదీ డేటా మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ (SDAIA) నిర్వహించిన ఫోరమ్‌ను మున్సిపల్ మరియు గ్రామీణ వ్యవహారాలు మరియు గృహనిర్మాణ మంత్రి మజేద్ అల్-హోగైల్ ప్రారంభించారు.  40 దేశాలకు చెందిన గ్లోబల్ సిటీ నిపుణులు, డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డిజిటల్ సొల్యూషన్స్‌లో నిపుణులు, స్మార్ట్ సిటీ ఇంజనీర్లు, ఇన్వెస్టర్లు మరియు ఎకనామిక్ పాలసీ మేకర్లు “ఎ బెటర్ లైఫ్” అనే థీమ్‌తో జరిగిన సదస్సులో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పారిశ్రామిక మరియు ఖనిజ వనరుల మంత్రి బందర్ అల్ఖోరాయేఫ్ మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీలను పారిశ్రామిక వృద్ధి, సాంకేతిక వ్యాప్తి మరియు స్థిరమైన పారిశ్రామిక అభివృద్ధికి ఇంజిన్‌లలో ఒకటిగా అభివర్ణించారు.         

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com