‘ఊరు పేరు భైరవ కోన’ ఇంతటితో ఆగేది కదా.?
- February 15, 2024
సందీప్ కిషన్, కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి ఇప్పటికే మంచి మౌత్ టాక్ నడుస్తోంది. ప్రమోషన్లు బాగున్నాయ్.
ప్రచార చిత్రాలూ పాజిటివ్‌గా వున్నాయ్. వాయిదాల పర్వం ముగించుకుని ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ బయటికి వచ్చింది. ‘ఊరు పేరు భైరవకోన’ ఇంతటితో ఆగే సినిమా కాదు. ఈ సినిమాకి సీక్వెల్‌తో పాటూ, ప్రీక్వెల్ కూడా వుందని చిత్ర నిర్మాత చెబుతున్నారు.
అలాగని ఈ సినిమాని సగంలో ఆపేసిసట్లు.. క్లైమాక్స్‌లో లీడ్ ఇచ్చి అసంపూర్తిగా వదిలిపెట్టలేదని సినిమా చూసిన ప్రేక్షకులు సంతృప్తికరంగా ధియేటర్ల నుంచి బయటికి వస్తారనీ తెలిపారు.
పురాణాల్లోని ఓ ముఖ్యమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది.. అని ప్రచార చిత్రాల ద్వారా అర్ధమవుతోంది. విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకి ప్రాణంగా కనిపిస్తుంది. చూడాలి మరి, సందీప్ కిషన్‌కి ఈ సినిమా అయినా అచ్చొస్తుందో లేదో.!
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







