'యునెస్కో' లెర్నింగ్ సిటీలలో చేరిన‌ మూడు సౌదీ నగరాలు

- February 16, 2024 , by Maagulf
\'యునెస్కో\' లెర్నింగ్ సిటీలలో చేరిన‌ మూడు సౌదీ నగరాలు

జెడ్డా: యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (UNESCO)  గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్‌లో  మదీనా, కింగ్ అబ్దుల్లా ఎకనామిక్ సిటీ మరియు అల్-అహ్సా గవర్నరేట్ లు చేరాయి. తాజా చేరిక‌ల‌తో నెట్‌వర్క్‌లో సౌదీ అరేబియా ప్రాతినిధ్యం ఐదు నగరాలకు విస్తరించింది. ఈ వృద్ధి సౌదీ విజన్ 2030 యొక్క స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు,  ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంద‌ని అధికార యంత్రాంగం తెలిపింది. నెట్‌వర్క్‌లోని నగరాలలో అన్ని వయసుల వారికి సమగ్ర అభ్యాస అవకాశాలను పెంపొందించడానికి, స్థానిక కమ్యూనిటీలలో అభ్యాస సంస్కృతికి మద్దతుగా ఆధునిక విద్యా సాధనాల వినియోగాన్ని మెరుగుపరచడానికి అవ‌స‌ర‌మైన మ‌ద్ద‌తును అంద‌జేస్తారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com