ఇంకా వరదల్లోనే దుకాణాలు, కార్లు!
- February 16, 2024
యూఏఈ: దేశంలోని తూర్పు తీరాన్ని తాకిన కుండపోత వర్షాలతో కల్బాలోని వివిధ ప్రాంతాలలో వరద పోటెత్తింది. మూడు రోజులు గడిచినా దుకాణాలు, కార్లు వరదల్లోనే ఉన్నాయి. కల్బాలోని అల్ కెరామ్ బేకరీలో తాండూర్ రోటీ మేకర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ.. తమ దుకాణం వరదలోనే ఉందని, మరో నెల రోజుల వరకు వరదనీరు నిలిచే అవకాశం ఉందన్నారు. చిన్న వ్యాపారాలతో, బిల్డింగ్ మెటీరియల్స్, ఇంజినీరింగ్ వర్క్‌లు, ఫర్నిచర్ మరియు ఆటోమొబైల్ గ్యారేజీలు వంటి అనేక మధ్య తరహా వ్యాపారాలు మిలియన్ల నష్టాలను ఎదుర్కొన్నాయి. కల్బాలోని పారిశ్రామిక జిల్లాలోని చిన్న తరహా కర్మాగారాలు, గిడ్డంగులు వరదల్లోన ఉన్నాయని అల్ ఫెసౌల్ మెటాలిక్ డోర్స్ అండ్ విండోస్ మేనేజర్ నబిల్ మహ్మద్ తెలిపారు. తమ వర్క్‌షాప్ మరియు ప్రొడక్షన్ యూనిట్ 3 అడుగుల వరకు నీటిలో మునిగిపోయాయని చెప్పారు. ఖరీదైన యంత్రాల పరంగా తాము గణనీయమైన నష్టాలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. మరోవైపు వరదలో మునిగిన వాహనాలను వెలికితీసేందుకు టోయింగ్ మరియు రికవరీ వాహనాలు 24 గంటలు పనిచేస్తున్నాయి.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్‌లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్‌కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









