టర్కిష్ పాఠశాలలకు $55 మిలియన్ల రుణం: సౌదీ
- February 17, 2024
ఇస్తాంబుల్: టర్కిష్ ప్రభుత్వ పాఠశాలల్లో భూకంప భద్రతను పెంపొందించే చర్యలో సౌదీ ఫండ్ ఫర్ డెవలప్మెంట్ (SFD) సీఈఓ సుల్తాన్ అల్-మర్షద్.. టర్కీ ట్రెజరీ మరియు ఆర్థిక శాఖ డిప్యూటీ మంత్రి ఉస్మాన్ సెలిక్తో $55 మిలియన్ల సాఫ్ట్-లోన్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇస్తాంబుల్‌లో సౌదీ-టర్కిష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ బిజినెస్ ఫోరమ్ సందర్భంగా ఈ ఒప్పందపై సంతకాలు చేశారు. ఈ ఆర్థిక సహాయం, టర్కీ అంతటా అనేక పాఠశాలలకు భూకంప ప్రమాదాన్ని తగ్గించే లక్ష్యంగా ప్రాజెక్ట్‌ను చేపట్టారు. SFD బోర్డ్ ఛైర్మన్ అహ్మద్ అల్-ఖతీబ్ మరియు టర్కీ ఆర్థిక మంత్రి మెహ్మెత్ సిమ్సెక్లు హాజరయ్యారు. 55,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఐదు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి మరియు పునరుద్ధరణతో పాటు భూకంప నష్ట నివారణకు అవసరమైన పరికరాలు మరియు సామాగ్రి సేకరణకు ఈ రుణం నిధులను ఉపయోగించనున్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









