రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రముఖులకు అవార్డులు..

- June 02, 2016 , by Maagulf
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రముఖులకు అవార్డులు..

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పలువురు ప్రముఖులకు ప్రకటించిన అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఇవాళ హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలకు సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలకు రూ.లక్షా 116 నగదు పురస్కారంతోపాటు శాలువా, సర్టిఫికెట్, మొమెంటోతో సత్కరించారు. కాగా, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మొత్తం 29 విభాగాల నుంచి 62 మంది ప్రముఖులను ప్రభుత్వం అవార్డులకు ఎంపిక చేసింది. అవార్డులకు ఎంపికైన వారిలో సాహిత్యం-7, నృత్యం-2, జానపద నృత్యం-1, సంగీతం-2, జానపద సంగీతం-5, ఉద్యమగానం-3, పెయింటింగ్-1, వేద పండితులు-1, అర్చకులు-2, ఆధ్యాత్మికం-1, సైంటిస్టులు-3, జర్నలిస్టులు-6, హస్త కళలు-6, క్రీడలు-2, ఉద్యోగులు-9, వైద్యులు-1, ఎన్‌జీవో-1, సోషల్ వర్క్-1, రైతులు-3, అంగన్‌వాడీ వర్కర్స్-1, ఉత్తమ మున్సిపాలిటీగా ఖమ్మం, ఉత్తమ గ్రామ పంచాయతీలు-3, న్యాయవాదులు-1, ఔత్సాహికులు-1, టీచర్లు-2, ఆధునిక రైతు-1, మాజీ సైనికులు-2, ధైర్యసాహసాలు-1 ఉన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com