వ్యాపారాలలో ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రతిపాదన తిరస్కరణ
- February 19, 2024
బహ్రెయిన్: ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగాలతో పాటు వ్యాపారాలు కూడా నిర్వహించుకునే ప్రతిపాదనను షూరా కౌన్సిల్ తిరస్కరించే అవకాశం ఉంది. ఈ మేరకు నేషనల్ అసెంబ్లీ అని పిలువబడే ప్రతినిధుల కౌన్సిల్ మరియు షురా కౌన్సిల్ ఉమ్మడి సెషన్లో ఓటింగ్ జరిగింది. షురా కౌన్సిల్లో ఆదివారం జరిగిన సమావేవంలో ప్రతిపాదనపై చర్చించారు. లాభ నష్టాలను పార్లమెంటరీ కమిటీ నివేదికపై మొదటగా చర్చించారు. ఎంపి డాక్టర్ మహమ్మద్ అలీ అల్ ఖుజాయ్ నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వ ఉద్యోగులను పని చేస్తూనే వ్యాపారాలలో నిమగ్నమవ్వాలనే ప్రతిపాదనతో విభేదిస్తున్నట్లు పేర్కొంది. పరస్పర ప్రయోజనం, ఆర్థిక హాని, భద్రతా ప్రమాదాలు, నియంత్రణ అసమతుల్యత, సంబంధిత సంస్థల అభ్యంతరం వంటి అంశాలు తలెత్తే అవకాశం ఉందని తన నివేదికలో కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. సౌదీ అరేబియా, జోర్డాన్, కువైట్, ఖతార్ మరియు లిబియాలో వ్యాపారాలు నిర్వేహించకుండా ప్రభుత్వ ఉద్యోగులపై నిషేధం ఉందని కమిటీ పేర్కొంది. ప్రతిపాదనను తిరస్కరించాలని సిఫార్సు చేసింది. షురా కౌన్సిల్ సభ్యులలో ఎక్కువ మంది ప్రతిపాదనను అనుమతించడానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో ప్రతిపాదన వీగిపోయింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







