అఫీషియల్ అప్డేట్.! చరణ్‌కి ఫిక్సయిపోయిన జాన్వీ కపూర్.!
- February 19, 2024‘దేవర’ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అతిలోక సుందరి ముద్దుల తనయ జాన్వీ కపూర్ తెలుగులోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేయబోతోంది జాన్వీ కపూర్.. అని ప్రచారం జరిగింది. ఆ నేపథ్యంలోనే పలువురు స్టార్ హీరోల సరసన జాన్వీ కపూర్.. అంటూ కూడా ప్రచారం జోరందుకుంది.
ఆ లిస్టులో మొదట రామ్ చరణ్ పేరు వినిపించింది. తాజాగా జాన్వీ కపూర్ తండ్రి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ఆ ప్రచారానికి అడ్డు కట్ట వేశారు. అది కేవలం ప్రచారం కాదు.. నిజమే అని కన్ఫామ్ చేశారు.
రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ పేరు ఖరారయ్యిందని ఆయన ప్రకటించారు తాజాగా.
సో, ఎప్పుడో ఈ కాంబో వర్కవుట్ అవ్వాల్సి వుంది. ఫైనల్లీ ఇప్పటికైనా కన్ఫామ్ అయ్యేసరికి జాన్వీ కపూర్ ఫ్యాన్స్.. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ