ఆ విషయంలో విశ్వక్ రూటే సెపరేటు.!
- February 20, 2024బిజీగా సినిమాలు చేయడమే కాదు.. ఆ సినిమాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలో కూడా బాగా తెలిసినోడు విశ్వక్ సేన్. రిలీజ్ దగ్గరికి వచ్చిన సినిమాలను ప్రమోట్ చేయడంలో ఎప్పటికప్పుడే కొత్త టెక్నిక్స్ ప్లే చేస్తూంటాడు.
తాజాగా ఆయన నటించిన ‘గామి’ చిత్రం రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అప్పుడెప్పుడో జరిగిపోయిన ఇష్యూని ఆసక్తికరంగా తెర పైకి తీసుకొచ్చాడు.
తద్వారా కాస్త సింపథీ, తన కొత్త సినిమాకి పబ్లిసిటీ.. ఒక్క దెబ్బకి రెండు పిట్టలన్నమాట. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.. సీనియర్ నటుడు అర్జున్ దర్శకత్వంలో ఒక సినిమా సగం షూటింగ్ అయ్యాకా ఆగిపోయింది.
అందుకు ప్రధాన కారణం హీరో విశ్వక్ సేనే.. ఆయన కమిట్మెంట్ లేని నటుడు కావడం వల్లనే అర్జున్ ఆ సినిమాని మధ్యలో ఆపేయాల్సి వచ్చిందని అప్పట్లో ఈ ఇష్యూ ఇండస్ర్టీలో టాక్ ఆఫ్ ది టాపిక్ అయిన సంగతి తెలిసిందే.
అప్పుడు సైలెంట్‌గా వున్న విశ్వక్ సేన్.. ఇప్పుడు ‘గామి’ సినిమా ప్రమోషన్లలో నోరు విప్పాడు. తన తప్పేం లేదనీ, ఆ సినిమా వల్ల తానే ఎక్కువ నష్టపోయాననీ, ఓ బ్యాక్ గ్రౌండ్ వున్న హీరో విషయంలో ఇలా జరిగితే అలాగే ఊరుకుంటారా.? అని సింపతీ గైన్ చేసే కార్యక్రమం చేపట్టాడు.
పబ్లిసిటీ కోసం కాకపోతే.. ఇప్పుడెందుకీ చర్చ కొత్తగా తెరపైకి తీసుకురావడం.. అంటూ కొందరు వాపోతున్నారు. మార్చి 8న ‘గామి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్‌లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్..