తెలుగు హీరోలపై మోజు పెంచుకుంటోన్న తమిళ స్టార్ హీరో.!
- February 21, 2024
ప్యాన్ ఇండియా వచ్చాకా.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాల్లేవ్. ఇండియన్ సినిమాగానే సినిమా చెలామణీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే వివిధ భాషల్లోని నటీ నటులు ఈజీగా మింగిల్ అయిపోతున్నారు.
వివిధ భాషల నటీ నటులు స్నేహ పూర్వకంగా కలిసి మెలిసి మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగు హీరోలతో ఎక్కువగా కలిసి సినిమాలు చేయాలనుకుంటున్నాడు.
టాలీవుడ్‌లో ధనుష్‌కి ఓ ప్రత్యేకమైన స్థానం వుంది ఇప్పటికే. ఆ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాలనుకుంటున్నాడు.
తెలుగు హీరోలూ, తెలుగు దర్శకులతో కలిసి పని చేస్తున్నాడు. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో ఆల్రెడీ ‘సార్’ సినిమా చేశాడు. యంగ్ హీరో సందీప్ కిషన్‌తో ‘కెప్టెన్ మిల్లర్’ కోసం స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.
అలాగే, ఇప్పుడు మరోసారి సందీప్ కిషన్‌తోనే కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మలయాళ నటుడు జయరాం కూడా నటిస్తున్నాడు ధనుష్‌తో కలిసి. ఇది ధనుష్‌కి 50వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ విశేషమైన రెస్సాన్స్ అందుకుంటోంది.
ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపే కుర్రాళ్లలా ఈ ముగ్గురూ నటిస్తున్నారు ఈ సినిమాలో. అయితే, ఏదో థ్రిల్లింగ్ ఎలిమెంట్‌ని ఈ సినిమాతో చూపించబోతున్నారని తెలుస్తోంది. అన్నట్లు ఈ సినిమాని స్వీయ దర్శకత్వంలో ధనుష్ తెరకెక్కిస్తున్నాడు. అలాగే, శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనూ ధనుష్ ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున గెస్ట్ రోల్ పోషిస్తున్నాడు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







