విక్రమ్ సినిమాకి తప్పని తిప్పలు.!
- February 21, 2024
విలక్షణ నటుడు విక్రమ్. తమిళ తంబీలు చియాన్ అని ముద్దుగా పిలుచుకునే ఈ హీరోకి తెలుగు నాట కూడా మంచి అభిమానం వుంది. అంతేకాదు, సినిమా కోసం ప్రాణాలే పణంగా పెట్టేసే నటుడు విక్రమ్.
గతంలో పలుమార్లు ఈ విషయం ప్రూవ్ చేశాడు. ప్రతీ సినిమాకీ మాగ్జిమమ్ రిస్క్ పెట్టేస్తుంటాడు. అలా విక్రమ్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ రిస్కీ అటెంప్టులు చాలా చాలా వున్నాయని చెప్పొచ్చు.
తాజాగా ‘తంగలాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రావల్సి వుంది. కానీ, ఆలస్యమవుతూ వస్తోంది. ఇదో భిన్నమైన చిత్రం.
ఈ సినిమాలో విక్రమ్‌కి అసలు డైలాగులే వుండవ్. కేవలం హావభావాలతోనే సినిమా మొత్తం కనిపిస్తాడట. ప్రపంచం మర్చిపోయిన ఓ ట్రైబల్ తెగ గురించి చెప్పే చిత్రమే ‘తంగలాన్’.
ఈ సినిమా కోసం అస్సలు గుర్తు పట్టలేకుండా మారిపోయాడు విక్రమ్. సీజీ వర్క్ చాలా ఎక్కువగా వుండడంతో ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అయితే, ఇప్పుడు రిలీజ్‌కి సిద్ధం చేద్దామా...అంటే స్లాట్ ఇష్యూస్ వస్తున్నాయ్.
గతంలోనూ విక్రమ్ సినిమా రిలీజ్‌కి ఈ తరహా చిక్కులు తప్పలేదు. ఈ సారి కూడా అదే పరిస్థితి. మరి, ఈ చిక్కుల్ని తప్పించుకుని ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ‘తంగలాన్’ ఎప్పుడు ప్రేక్షకుల్ని అలరిస్తుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







