గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తాం: సీఎం రేవంత్
- February 21, 2024
హైదరాబాద్: పాలకుల నిర్ణయాలు రాష్ట్ర ఆర్థిక పురోగతికి దోహదపడతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే తమ విధానమని చెప్పారు. ఆర్థిక ప్రగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత పాలకుల నిర్ణయాల వల్లే హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారిందని గుర్తు చేశారు. ఆ రోజు రింగ్‌రోడ్డు గురించి మాట్లాడితే అవన్నీ ఇప్పుడు ఎందుకు అన్నారని, కానీ ఇప్పుడు రింగ్ రోడ్డే నగర అభివృద్ధికి మూలంగా మారిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని హోటల్ వెస్టిన్‌లో సీఐఐ తెలంగాణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా విద్య, నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపక అవకాశాలు అనే అంశంపై రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ఇందిరాగాంధీ విధానపరమైన నిర్ణయం తీసుకుని ఐడీపీఎల్‌ను ప్రారంభించినందునే ఫార్మా రంగంలో హైదరాబాద్ మెరుగైన స్థితిలో ఉందని చెప్పారు. గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామని చెప్పారు. తమ సర్కార్ పెట్టుబడులు, అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. ఐటీఐల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం టాటా సంస్థతో ఒప్పందం చేసుకున్నామని గుర్తు చేశారు. కొత్త ప్రభుత్వంలో వేధింపులు ఉంటాయని వ్యాపారులు భయపడాల్సిన అవసరం లేదని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాల కల్పనకు సీఐఐతో కలిసి ముందుకు నడుస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. 64 ఐటీఐలను స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లుగా రూ.2000 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నామని తెలిపారు. స్కిల్లింగ్ యూనివర్సిటీల ఏర్పాటు కోసం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో చేరిన విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్ ఇవ్వనున్నట్లు వివరించారు. తెలంగాణలో డ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి వివరించారు.
“ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా విధానం. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం. అభివృద్ధి విషయంలో మా ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవు. నగర అభివృద్ధి కోసం గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తాం. గతంలో ఔటర్ రింగ్ రోడ్ అవసరం లేదని కొందరు అన్నారు. ఇప్పుడది హైదరాబాద్‌కు లైఫ్ లైన్‌గా మారింది. ఐటీఐల్లో నైపుణ్యాభివృద్ధి కోసం టాటా సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకున్నాం. 64 ఐటీఐలను స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లుగా రూ.2000 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నాం.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







