చదువుకునే పిల్లలు ఒత్తిడిని తట్టుకునేందుకు.!

- February 21, 2024 , by Maagulf
చదువుకునే పిల్లలు ఒత్తిడిని తట్టుకునేందుకు.!

పరీక్షల కాలం వచ్చేసింది. ఓ వైపు బోర్డ్ ఎగ్జామ్స్.. మరోవైపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈ టైమ్‌లో పిల్లలు చాలా చాలా ఒత్తిడికి లోనవుతూ వుంటారు.

ఓ పక్క చదివింది గుర్తు లేక, మరోపక్క చదవాల్సింది చాలా వుండి.. తీవ్రమైన ఒత్తిడి ఆందోళనకు గురవుతూ వుంటారు. బాగా చదవడం కాదు.. ఎగ్జామ్ హాల్లో ఎవడైతే సరిగ్గా ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తాడో వాడే టాపర్‌ అవుతాడు.. అని ఓ తెలుగు హీరో తన సినిమాలో డైలాగ్ చెబుతాడు.

అంతేగా.. బాగా చదివేయడం కాదు.. ఎగ్జామ్ హాల్లో ఎంత పీస్‌ఫుల్ మైండ్‌తో ఇచ్చిన ప్రశ్నలకు కరెక్ట్ ఆన్సర్లు రాస్తాడో వాడే టాపర్. మరి, ఇంత ఒత్తిడిలో అలాంటి బెస్ట్ పర్‌ఫామెన్స్ ఇవ్వాలంటే.. ఆ ఒత్తిడిని తట్టుకునే శక్తి వుండాలి. అందుకోసం చిన్న చిన్న టిప్స్ పాటించాలి.

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చదువుకోవడానికి ముందుగా ఓ షెడ్యూల్ టైమ్ టేబుల్ సెట్ చేసుకోవాలి. అంతా ఒక్కసారే చదివేయాలి అనుకోకుండా.. షెడ్యూల్ ప్రకారం టైమ్‌నీ మెయింటైన్ చేయాలి. ఒక 25 నిమిషాల పాటు చదివి.. 5 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి.

అలా మళ్లీ రెండు మూడు ట్రిప్పులు చదివిన తర్వాత ఓ అర్ధ గంట సేపు రెస్ట్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల చదివింది గుర్తుంటుంది. మైండ్ కూడా ఒత్తిడి నుంచి రిలాక్స్ అవుతుంది.

ఎక్కువ సేపు నిద్రకు భంగం కలిగించి చదవకూడదు. అలా చేయడం వల్ల చదివింది అస్సలు గుర్తుండదు. సరిపడా నిద్ర కూడా అవసరమే. ఉదయం ఎర్లీ అవర్స్‌లో చదువుకోవడానికి కేటాయిస్తే మంచిది. ప్రశాంతమైన వాతావరణంలో చదువుకున్నది బుర్రకి బాగా ఎక్కుతుంది.

మధ్య మధ్యలో ఏవైనా స్నాక్స్ తినడం.. సహజసిద్ధమైన చల్లని పానీయాలు తీసుకోవడం మంచిది. చదువుతో పాటూ, మంచి నిద్ర, పోషకాలున్న ఆహారం తినడం కూడా అవసరం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com