యూఏఈ హెడ్‌కోచ్‌గా భారత టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ మేనేజర్
- February 21, 2024
ఐసీసీ 2007లో దక్షిణాఫ్రికా వేదికగా నిర్వహించిన తొలి టీ20 వరల్డ్ కప్‌లో ట్రోఫీ నెగ్గిన భారత జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించిన మాజీ టెస్ట్ క్రికెటర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ మరో విదేశీ టీమ్‌కు హెడ్‌కోచ్‌గా వెళ్లనున్నాడు. కోచ్‌గా మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఆయన.. తాజాగా యూఏఈ సీనియర్ మెన్స్ క్రికెట్ టీమ్‌కు హెడ్‌కోచ్‌గా ఎంపికయ్యాడు. ఈ ఏడాది అమెరికా/వెస్టిండీస్ వేదికగా జరుగబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొంటున్న యూఏఈ.. ఆ టోర్నీలో మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు గాను లాల్‌చంద్ రాజ్‌పుత్‌ను హెడ్‌కోచ్‌గా తీసుకుంది.
భారత్ నెగ్గిన ఏకైక టీ20 వరల్డ్ కప్ టీమ్‌కు మేనేజర్‌గా పనిచేసిన లాల్‌చంద్.. 2016-17లో అఫ్గానిస్తాన్ టీమ్‌కు హెడ్‌కోచ్‌గా పనిచేశాడు. లాల్‌చంద్ హయాంలోనే అఫ్గానిస్తాన్.. సంచలన విజయాలతో ప్రపంచ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసింది. ఆ జట్టుకు టెస్టు స్టేటస్ దక్కింది కూడా లాల్‌చంద్ పీరియడ్‌లోనే కావడం గమనార్హం. ఆ తర్వాత జింబాబ్వే జట్టుకు హెడ్‌కోచ్‌గా పనిచేసిన లాల్‌చంద్.. 2022లో ఆ జట్టు టీ20 వరల్డ్ కప్‌లో క్వాలిఫై కావడంలో ఆయన కృషి ఎంతో ఉంది. అప్పటిదాకా అనామక జట్టుగా ఉన్న జింబాబ్వే.. గత టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ వంటి అగ్రశ్రేణి జట్టుకు షాకిచ్చింది.
తాజాగా లాల్‌చంద్ యూఏఈకి హెడ్‌కోచ్‌గా మూడేండ్ల కాంట్రాక్టుపై వెళ్లనున్నాడు. ఈనెల 28 నుంచే ఆయన పని మొదలవనుంది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్‌లో భాగంగా యూఏఈ.. స్కాట్లాండ్, కెనడాలతో ఈనెల 28 నుంచి ముక్కోణపు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ నుంచే లాల్‌చంద్.. యూఏఈకి హెడ్‌కోచ్‌గా సేవలందించనున్నాడు. అఫ్గాన్, జింబాబ్వే జట్లను ఓ మార్గంలో పెట్టిన లాల్‌చంద్.. తమ టీమ్‌కూ అలాంటి సక్సెస్సే అందిస్తాడని యూఏఈ క్రికెట్ పెద్దలు భావిస్తున్నారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు గాను లాల్‌చంద్.. యూఏఈ క్రికెట్ బోర్డుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







