ఎడారి రిసార్ట్ 'అవర్ హాబిటాస్ రాస్ అబ్రౌక్' ప్రారంభం

- February 24, 2024 , by Maagulf
ఎడారి రిసార్ట్ \'అవర్ హాబిటాస్ రాస్ అబ్రౌక్\' ప్రారంభం

దోహా: ఖతార్ ఎయిర్‌వేస్ గ్రూప్ అవర్ హాబిటాస్ భాగస్వామ్యంతో ఖతార్ వెస్ట్ కోస్ట్‌లో అల్ రీమ్ యునెస్కో బయోస్పియర్ రిజర్వ్ స‌మీపంలో విలాసవంతమైన రిసార్ట్‌ను ప్రారంభించింది. దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఒక గంట ప్రయాణంలో ఉన్న ఈ రిసార్ట్‌లో అరేబియా గల్ఫ్ అంద‌మైన ప్ర‌కృతి వీక్షణలు, అద్భుతమైన బంగారు సూర్యాస్తమయాలతో పాటు ఆర్ట్స్, సంస్కృతి, సంగీతం, వెల్నెస్ మరియు అడ్వెంచర్ ప్రోగ్రామ్ లను ఆస్వాదించ‌వ‌చ్చు. ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో ఖతార్ మ్యూజియంల చైర్‌పర్సన్ HE షేఖా అల్ మయాస్సా బింట్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీతో పాటు ప్ర‌ముఖులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఖతార్ ఎయిర్‌వేస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఇంజినీర్. బదర్ మహ్మద్ అల్ మీర్ మాట్లాడుతూ.. త‌మ‌ హాబిటాస్ రాస్ అబ్రౌక్ అనేది అందమైన ఖతారీ ఎడారి గమ్యస్థానం అన్నారు.  ఖతార్ ఎయిర్‌వేస్ గ్లోబల్ నెట్‌వర్క్‌లోని ప్రయాణికులు దోహా సంద‌ర్శ‌న స‌మ‌యంలో  ఈ ప్రకృతి దృశ్యాన్ని ప్రత్యేకమైన రీతిలో అనుభవించవచ్చ‌ని తెలిపారు.  ఎడారి రిసార్ట్‌లో ఆన్-సైట్ రెస్టారెంట్, కిస్సా, టెర్రస్ లాంజ్, బీచ్ క్లబ్, వెల్‌నెస్ సెంటర్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ జిమ్, వాటర్ స్పోర్ట్స్ అడ్వెంచర్ హబ్, ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్ మరియు పాడెల్ టెన్నిస్ కోర్టులు ఉన్నాయన్నారు.  ధియాఫాటినా ఇటీవలే ఉత్తర ఖతార్‌లో వాటర్ స్పోర్ట్స్ హోటల్‌ను ప్రారంభించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com