‘సుదర్శన్ సేతు’ను ప్రారంభించిన ప్రధాని
- February 25, 2024
గుజరాత్: గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ‘సుదర్శన్ సేతు’ను ప్రారంభించారు. దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జిగా ఇది నిలిచింది. 4 లేన్ల రహదారి కలిగిన ఈ వంతెన 2.32 కిలోమీటర్ల పొడవు ఉంది. దీని నిర్మాణానికి రూ.979 కోట్లు ఖర్చయ్యాయి. ఈ వంతెన ఓఖా ప్రాంతంతో ద్వారక ద్వీపాన్ని అనుసంధానం చేస్తుంది. త్వరలోనే ఈ బ్రిడ్జిపై పూర్తి స్థాయిలో రాకపోకలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.
ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ వంతెనకు ఇరువైపులా భగవద్గీతలోని శ్లోకాలు, శ్రీకృష్ణుని చిత్రాలతో అలంకరించబడిన నడక మార్గం ఉంది. ఈ వంతెనను ప్రారంభించిన తరవాత ప్రధాని మోదీ ఈ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ తరవాత గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో తొలి AIIMS హాస్పిటల్‌ని ప్రారంభిస్తారు. కేబుల్ బ్రిడ్జ్‌ని ప్రారంభించడంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని వెల్లడించారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







