సెలవులకు ఇండియా వెళ్లి తిరిగి వస్తుండగా.. కారు ప్రమాదంలో ఐదేళ్ల బాలిక మృతి
- February 26, 2024
దుబాయ్: భారతదేశంలో తన తోబుట్టువుల రెండు వివాహాలను జరుపుకున్న తర్వాత, శుక్రవారం దుబాయ్‌లో దిగిన జోబిన్ బాబు వర్గీస్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఫిబ్రవరి 23న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వారి ఇంటికి వెళుతుండగా వారి కారు ఘోరమైన ప్రమాదానికి గురైంది. జాబిన్ 5 ఏళ్ల కుమార్తె నవోమి జోబిన్ బాబు ప్రాణాలు కోల్పోయింది. కారు నడుపుతున్న జాబిన్ సోదరుడు కేరళలో సెలవుల అనంతరం విమానాశ్రయం నుంచి కుటుంబాన్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో నవోమితో పాటు ఆమె సోదరుడు నాథన్ జాబిన్, ఆమె అక్క నోవా జాబిన్, వారి తల్లి సోబిన్ ఉన్నారు. "మా కారు టైర్ అకస్మాత్తుగా పగిలింది. స్టీరింగ్ వీల్ అదుపు తప్పింది. వాహనం బోల్తా పడింది." అని బాలిక తండ్రి తెలిపాడు. షార్జా వైపు వెళుతున్న షేక్ మహ్మద్ బిన్ జాయెద్ రోడ్ (ఈ311)లో టర్నింగ్ అవుతుండగా రషీదియా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కారులో ఉన్న ఇతరులకు స్వల్ప గాయాలయ్యాయి. యూఏఈలో పెరిగిన జాబిన్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్‌లో పనిచేస్తున్నారు. షార్జాలో తన కుటుంబంతో నివసిస్తున్నారు. నవోమి షార్జా ఇండియన్ స్కూల్లో కిండర్ గార్టెన్‌లో చదువుతున్నది. బుధవారం జెబెల్ అలీలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







