అజ్మాన్ లో అగ్నిప్రమాదం..9 మందికి గాయాలు

- February 26, 2024 , by Maagulf
అజ్మాన్ లో అగ్నిప్రమాదం..9 మందికి గాయాలు

యూఏఈ:  అజ్మాన్‌లోని ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంలో 9 మంది కార్మికులు గాయ‌ప‌డ్డారు. వీరంద‌రూ పాకిస్తాన్ జాతీయులు సింధ్, పంజాబ్ ప్రావిన్సులకు చెందినవారని అధికారులు తెలిపారు. "ఫిబ్రవరి 24న అజ్మాన్‌లోని శానిటైజర్లు, పెర్ఫ్యూమ్‌లు మరియు సంబంధిత రసాయన ఉత్పత్తుల కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దురదృష్టకర సంఘటనలో తొమ్మిది మంది పాకిస్థానీలు గాయపడ్డారు. వారిని వెంటనే వివిధ ఆసుపత్రులకు తరలించారు" అని పోలీసులు తెలిపారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ పాకిస్తాన్ వెల్ఫేర్ వింగ్ బృందం ఆస్ప‌త్రుల‌లో చికిత్స పొందుతున్న కార్మికుల యోగ‌క్షేమాల‌ను ప‌ర్య‌వేక్షిస్తుంది. యూఏఈలోని పాకిస్తాన్ రాయబారి ఫైసల్ నియాజ్ తిర్మిజీ క్షతగాత్రులు కోలుకోవాలని,  ప్రమాదంలో బాధితులైన పాకిస్థానీలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com