లెజండరీ సింగర్ పంకజ్ ఉదాస్ కన్నుమూత
- February 26, 2024
ముంబై: పద్మశ్రీ అవార్డు గ్రహీత లెజండరీ సింగర్ పంకజ్ ఉదాస్ (72) సోమవారం కన్నుమూశారు. గతకొంతకాలంగా పంకజ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముంబైలోని బ్రిచ్ క్యాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
కాగా, పంకజ్ ‘నామ్’, ‘సాజన్’, ‘మొహ్రా’ వంటి సినిమాల నేపథ్య గాయకుడిగా సంగీత ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక 1986లో విడుదలైన నామ్ సినిమాలో ‘చిట్టి ఆయూ హై చిట్టీ ఆయుహై’ పాట ఆయనకు ప్లేబ్యాక్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. పంకజ్ సోదరులు కూడా గాయకులు. పంకజ్ అన్నయ్య మన్‌హర్ ఉదాస్ ప్లేబ్యాక్ సింగర్‌గా రాణించారు. రెండో అన్న నిర్మల్ గజల్ గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తన సోదరుల బాటలోనే పంకజ్ కూడా ప్లేబ్యాక్ సింగర్‌గా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







