మార్చి 11 నుండి రమదాన్ 2024 ప్రారంభం..!

- February 27, 2024 , by Maagulf
మార్చి 11 నుండి రమదాన్ 2024 ప్రారంభం..!

యూఏఈ: అంతర్జాతీయ ఖగోళ కేంద్రం ప్రకటన ప్రకారం.. చాలా ఇస్లామిక్ దేశాలలో రమదాన్ మార్చి 11 న ప్రారంభమవుతుంది. సూర్యుడు - చంద్రుని మధ్య కంజక్షన్ మార్చి 10న GMT ఉదయం 9 గంటలకు జరుగుతుంది. అయితే, మార్చి 10వ తేదీన చంద్రుడిని చూడటం అరబ్ మరియు ఇస్లామిక్ ప్రపంచంలో ఎక్కడి నుండైనా కంటితో లేదా టెలిస్కోప్ ఉపయోగించి సాధ్యం కాదని ఆ ప్రకటన పేర్కొంది. మార్చి 10న ఇస్లామిక్ ప్రపంచంలోని నగరాల్లో సూర్యాస్తమయం తర్వాత చంద్రుడు అస్తమిస్తాడని, ఆరోజున చంద్రుడు కనిపించేందుకు అనువైన వాతావరణం లేదని ఇంటర్నేషనల్ ఖగోళ శాస్త్ర కేంద్రం డైరెక్టర్ ఇంజనీర్ ముహమ్మద్ షౌకత్ ఓదే తెలిపారు. అందువల్ల చాలా దేశాలు మార్చి 11న నెలవంకను చూస్తాయని, రమదాన్ మార్చి 12న ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. మార్చి 11న సూర్యాస్తమయం తర్వాత దాదాపు 15-25 నిమిషాలకు పశ్చిమ హోరిజోన్‌కు దగ్గరగా కంటితో చంద్రవంకను సులభంగా చూడవచ్చని ఒదేహ్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com