దర్శకుడు క్రిష్‌పై ఆ రూమర్లు.! తూచ్ అంతా వుత్తదే.!
- February 28, 2024
దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పేరు డ్రగ్స్ కేస్ లిస్టులో యాడ్ అయ్యిందనీ.. ఈ విషయం తెలిసిన ఆయన ప్రస్తుతం పరారీలో వున్నారంటూ ఓ గాసిప్ కొన్ని మీడియా ఛానెల్స్‌లో చక్కర్లు కొట్టింది.
దాంతో ఆయన అభిమానులు అవాక్కయ్యారు. ఆందోళనలో పడ్డారు. తాజాగా ఈ రూమర్‌ని ఖండిస్తూ, దర్శకుడు క్రిష్ స్పందించారు.
తనపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదనీ, తానెక్కడికీ పారిపోలేదనీ, అసలు ఈ రూమర్ క్రియేట్ కావడానికి కారణం వివరించారాయన.
రెండు రోజుల క్రితమే ఓ ఫ్రెండ్‌ని కలవడానికి క్రిష్ ఓ హోటల్‌కి వెళ్లడంతో ఈ ప్రచారం జోరందుకుంది. సదరు హోటల్లో కొందరు టాలీవుడ్ ప్రముఖుులు డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారనీ ఆ లిస్టులో క్రిష్ పేరు కూడా వుందన్నదే ఈ ప్రచారం తాలూకు సారాంశం.
అయితే, ఆ కేస్‌కీ తనకూ ఎలాంటి సంబంధం లేదనీ, పోలీస్ రైడ్ జరగడానికి ముందే తాను ఆ హోటల్ నుంచి బయటికి వచ్చేశాననీ, ఆల్రెడీ పోలీసులకు తాను స్టేట్మెంట్ కూడా ఇచ్చాననీ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంలో నిజం లేదనీ ఆయన వివరణ ఇచ్చారు.
దాంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయినా, డ్రగ్స్ కేసులో సెలబ్రిటీల పేర్లు వినిపించడం ఈ మధ్య సహజంగా మారిపోయింది. నిజం వున్నా లేకున్నా.. ఆ వార్త ఇట్టే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తోంది.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!