జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం..12 మంది మృతి

- February 28, 2024 , by Maagulf
జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం..12 మంది మృతి

జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో అక్కడిక్కకడే 12 మంది మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు.

జార్ఖండ్‌లోని జంతారా దగ్గర బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, రెస్య్కూ బృందాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com