శ్రీ విష్ణు కొత్త ప్రయోగం.! స్వాగణిక వంశానికి స్వాగతం.!
- February 29, 2024
కంటెంట్ వున్న కథలకు పెట్టింది పేరు యంగ్ హీరో శ్రీ విష్ణు. కమర్షియల్ థింకింగ్ వైపు అస్సలు అడుగులేయడు. ఎప్పటికప్పుడే సరికొత్త కథలను తెరపైకి తీసుకు రావాలనుకుంటాడు. అందుకే సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా శ్రీ విష్ణు సినిమాలు ప్రేక్షకుల్ని అలరిస్తుంటాయ్.
ఇటీవల ‘సామజవరగమన’ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించిన శ్రీ విష్ణు త్వరలోనే ‘ఓం భీమ్ భుష్’ అనే సినిమాతో ప్రేక్షకులకు ఓ కొత్త కథ పరిచయం చేయబోతున్నాడు.
అలాగే, తాజాగా మరో న్యూ స్టోరీని పరిచయం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ వదిలారు మేకర్లు.
గతంలో ‘రాజ రాజ చోర’ తెరకెక్కించిన దర్శకుడు హసిత్ గోలీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. టి.జి.విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ని చాలా ఇన్నోవేటివ్‌గా రిలీజ్ చేశారు.
టైటిల్ పేరు ‘స్వాగ్’. కార్టూన్ బొమ్మలతో కూడిన ఓ ప్రత్యేకమైన ఎపిసోడ్‌తో ఈ టైటిల్ గ్లింప్స్ సిద్ధం చేశారు. సునీల్, గంగవ్వ తదితరులు ఈ కార్టూన్ బొమ్మలకి వాయిస్ ఇచ్చారు. ఈ సరికొత్త టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోంది.
తాజా వార్తలు
- భారత్ ఘన విజయం
- అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్‌తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్
- ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- అల్ హదీథా బార్డర్ వద్ద స్మగ్లింగ్ గుట్టురట్టు..!!







