‘ఆపరేషన్ వాలైంటైన్’.! కేవలం సినిమా కాదిది.!
- February 29, 2024
ఇంతవరకూ ఏ తెలుగు హీరో చేయని సాహసంగా పేర్కొంటున్నారు ‘ఆపరేషన్ వాలైంటైన్’ సినిమాలో వరుణ్ తేజ్ పాత్రని. పుల్వామా దాడి నేపథ్యంలో రూపొందిన తొలి తెలుగు ఎయిర్ ఫోర్స్ నేపథ్యం కథనమే ‘ఆపరేషన్ వాలైంటైన్’.
ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా చాలా కష్టపడ్డాడు. ఆయన కెరీర్‌లో వస్తున్న తొలి ప్యాన్ ఇండియా చిత్రం కూడా ఇదే. నిజానికి ఇది సినిమా కాదు, ఇదో సాహసమే.. కాదు కాదు, తెలుగు జాతికి గర్వ కారణం.. అంటూ ‘ఆపరేషన్ వాలైంటైన్’ గురించి మాట్లాడుతున్నారు.
డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింహా ఉత్తరాది కుర్రోడు. ఆయన మన టాలీవుడ్ హీరో అయిన వరుణ్ తేజ్‌కి ఈ కథ చెప్పినప్పుడు మొదట వరుణ్‌కి భయమేసిందట. కానీ, కటౌట్ పరంగా ఈ సినిమాలో వరుణ్‌నే హీరోగా తీసుకోవాలని గట్టిగా అనుకున్నాడట ప్రతాప్ సింగ్.
అలా ఫైనల్లీ ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించేందుకు ప్రతాప్ సింగ్ చాలా చాలా గ్రౌండ్ వర్క్ చేశాడట. పూర్తిగా ఎయిర్ ఫోర్స్ గురించి తెలుసుకున్నాకే సినిమాని పట్టాలెక్కించాడట. అందుకు చాలానే టైమ్ కూడా తీసుకున్నాడట.
అలాగే, వరుణ్ తేజ్ హిందీ డబ్బింగ్ కోసం రెండు నెలలు ట్యూటర్‌ని పెట్టుకుని హిందీ స్పష్టంగా నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పాడట. బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్లర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. రేపు అనగా మార్చి 1న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
తాజా వార్తలు
- గిన్నిస్ రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య!
- కువైట్ లో ది లీడర్స్ కాన్క్లేవ్..!!
- సౌదీలో 23,094 మంది అరెస్టు..!!
- బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!
- ప్రపంచ శాంతికి ఖతార్ కృషి..!!
- బర్నింగ్ డాల్ ట్రెండ్ పై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- ROHM లో స్టార్ డయానా హద్దాద్ కాన్సర్ట్..!!
- దోహా చర్చలతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి ఒప్పందం
- శంకర నేత్రాలయ USA తమ 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలకు అందిస్తున్న ఘన సత్కారం
- నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష