'కబాలి' చిత్రం ఆడియో జూన్‌ 12న విడుదల..

- June 03, 2016 , by Maagulf
'కబాలి' చిత్రం ఆడియో జూన్‌ 12న విడుదల..

 సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ కథానాయకుడిగా నటించిన 'కబాలి' చిత్రం ఆడియోను జూన్‌ 12న విడుదల చేయనున్నారు. చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ.. పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. రాధికా ఆప్టే ఈ చిత్రంలో రజినీ భార్యగా నటించారు. పా రంజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కలైపులి ఎస్‌ థను నిర్మించారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం సమకూర్చారు. థన్సిక, కిశోర్‌, జాన్‌ విజయ్‌, దినేష్‌ రవి ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌ 2 కోట్ల వ్యూస్‌తో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com