‘కల్కి’ అప్డేట్.! ఇది మీకు తెలుసా.?
- March 04, 2024
ప్రబాస్ తాజా చిత్రం ‘కల్కి’ సినిమాపై భారీగా అంచనాలున్న సంగతి తెలిసిందే. సైంటిఫిక్ మైథాలాజికల్ ప్యాటర్న్‌లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్లో ప్రముఖ సీనియర్ నిర్మాత అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాకి ‘మహానటి’ ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పదుకొనె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ తదితర బాలీవుడ్ దిగ్గజ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మే 9న ‘కల్కి’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని కాన్ఫిడెంట్‌గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. అందుకు తగ్గట్లుగానే శరవేగంగా చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. కాగా, లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ట్రైలర్‌ని నెల రోజులు ముందుగానే అంటే, ఏప్రిల్ 9 కల్లా రిలీజ్ చేస్తామని తాజాగా మరో అప్డేట్ వదిలింది చిత్ర యూనిట్.
సినిమా రిలీజ్‌కి కేవలం కొన్ని రోజుల గ్యాప్‌లో మాత్రమే ట్రైలర్ రిలీజ్ చేస్తుంటారు. మూడు లేదా నాలుగు లేదంటే ఒక వారం ముందు మాత్రమే ట్రైలర్ రిలీజ్ పండగ వుంటుంది. కానీ, ఏకంగా నెలరోజులు ముందుగా ట్రైలర్ రిలీజ్ చేస్తామని ప్రకటించడం.. అది కూడా మరో నెల ముందే రివీల్ చేయడంపై అశ్వనీదత్ అండ్ కో పెద్ద స్కెచ్చే వుందని అనుకోవాలేమో. ఏది ఏమైతేనేం, ప్రబాస్ ఫ్యాన్స్‌కి ఇదో పండగే అని చెప్పాలి.
తాజా వార్తలు
- టీ20 సిరీస్ టీమిండియాదే
- మేరీల్యాండ్‌లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
- ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్..!!
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!
- యూఏఈలో రెయిన్స్ తగ్గుముఖం..!!
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'







