ఈద్ లాంగ్ బ్రేక్: టూర్ ప్యాకేజీల‌కు ఫుల్ డిమాండ్

- March 06, 2024 , by Maagulf
ఈద్ లాంగ్ బ్రేక్:  టూర్ ప్యాకేజీల‌కు ఫుల్ డిమాండ్

యూఏఈ:  ర‌మ‌దాన్ సంద‌ర్భంగా దాదాపు 6 రోజుల‌పాటు సెల‌వులు వ‌స్తున్నాయి. దీంతో ఎక్కువ మంది ఇత‌ర ప్రాంతాల్లో సెల‌వుల‌ను గ‌డిపేందుకు ఆస‌క్తి చూపుతున్నారు.  పవిత్ర ర‌మ‌దాన్ మాసం ముందు ప్రయాణ బుకింగ్‌లలో గణనీయమైన పెరుగుదల కనిపించిందని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. "కస్టమర్‌లు చేసిన బుకింగ్‌లలో దాదాపు 25-28 శాతం ఎక్కువ సెలవు ప్యాకేజీలను ఎంచుకుంటున్నాయి" అని ముసాఫీర్ కంపెనీ COO రహీష్ బాబు తెలిపారు.  DW ట్రావెల్‌లో సీనియర్ మేనేజర్ ఎమిలీ జెంకిన్స్ మాట్లాడుతూ.. "మా క్లయింట్లు సెలవులను బుక్ చేస్తున్నప్పుడు ఎక్కువ కాలం బ‌య‌ట స్టే చేసేలా ప్లాన్లు తీసుకున్న‌ట్లు తాము గ‌మ‌నించాము. " అని చెప్పారు. ఈద్ అల్ ఫితర్ ఏప్రిల్ 10 న వ‌స్తుందని భావిస్తున్నారు. ఏప్రిల్ 9 (ర‌మ‌దాన్ 29),  ఏప్రిల్ 13 (షవ్వాల్ 3) వరకు ఈద్ సెల‌వులు ఉండ‌నున్నాయి. మ‌రోవైపు యూఏఈ అంతటా చాలా పాఠశాలలు మార్చి మధ్య నుండి టర్మ్ బ్రేక్‌ను ప్ర‌క‌టించాయి. దీంతో టూర్ ప్లాన్ల‌కు భారీగా డిమాండ్ ఏర్ప‌డింద‌ని టూర్ ఆప‌రేట‌ర్లు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రీస్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్జా, జార్జియా, అర్మేనియా, అజర్‌బైజాన్, కజకిస్తాన్ మరియు కిర్గిజ్‌స్థాన్ వంటి దేశాలు అధికంగా డిమాండ్ కొనసాగుతుంద‌న్నారు.  అదే స‌మ‌యంలో మాల్దీవులు, శ్రీలంక, యూకే, స్విట్జర్లాండ్, సౌదీ అరేబియా మరియు జాంజిబార్ వంటి ఇతర ప్రదేశాలకు వెళ్లేందుకు కూడా అధిక డిమాండ్ ఉంద‌న్నారు.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com