జాన్వీ కపూర్ బర్త్‌డే గిఫ్ట్.! పోలా.! అదిరిపోలా.!
- March 06, 2024
బాలీవుడ్ బ్యూటీ.. అతిలోక సుందరిగా తెలుగు వాళ్లు అమితంగా అభిమానించే శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్.. తెలుగులో సినిమాలు చేయకుండానే అపారమైన అభిమానం సంపాదించుకుంది.
ఆమె నటించిన బాలీవుడ్ చిత్రాల తెలుగు వెర్షన్‌తోనే తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకుంది. ఇక, ఇప్పుడు ‘దేవర’ సినిమాతో డైరెక్ట్‌గా తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది.
ఈ నేపథ్యంలోనే జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ‘దేవర’ లుక్ మెస్మరైజ్ చేసేలా వుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ పల్లెటూరి అమ్మాయి ‘తంగం’ పాత్రలో నటిస్తోందని తెలుసు. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ గతంలోనే రిలీజ్ చేశారు.
బర్త్‌డే సందర్భంగా మరో లుక్ రిలీజ్ చేశారు. ఈ లుక్‌లో జాన్వీ పాప అందాలు మరింత కవ్విస్తున్నాయ్. పద్దతైన చీరకట్టు, నుదుటిన బొట్టు.. సాంప్రదాయ లుక్స్‌తో అసలు సిసలు తెలుగు ఆడపడుచులా కనిపిస్తూ.. సినిమా రిలీజ్‌కి ముందే తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది.
ఇది కదా తెలుగోళ్ల సత్తా.! అనేలా వుందీ ఈ తాజా పోస్టర్‌లో జాన్వీ లుక్. అన్నట్లు ఈ సినిమాతో పాటూ, జాన్వీ కపూర్, రామ్ చరణ్ సినిమాలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే, ‘దేవర’ను ఈ ఏడాది దసరాకి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







