కడుపు ఉబ్బరంగా, పట్టేసినట్లుందా.?
- March 06, 2024
కొన్ని సమస్యలకు కొన్ని ఇంటి చిట్కాలు బాగా పని చేస్తాయ్. వాటిని కొట్టి పారేస్తూ.. ఇంగ్లీష్ మందులతో కాలక్షేపం చేద్దామనుకుంటే, ఆ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్టుల్ని సైతం భరించాల్సి వస్తుంది.
ముఖ్యంగా గ్యాస్ సమస్యలు ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా అందర్నీ వేధిస్తున్న సమస్యలో ఒకటి. చిన్నా పెద్దా తేడా లేదు.. అందరికీ గ్యాప్ నొప్పి. కడుపు ఉబ్బరం..!
ఈ సమస్యని తాత్కాలికంగా పోగొట్టుకునేందుకు ఈనో వంటి మందులు అందుబాటులో వున్నాయ్. అలాగే రిఫ్లెక్స్ ఫోర్ట్ తదితర మందుల వాడకం కూడా విరివిగా జరుగుతోంది.
కానీ, వీటన్నింటి కంటే మంచి ఔషధం. మన వంటింటి పోపుల బాక్స్‌లో వుండే వాము. వాముకు ఆయుర్వేదంలో మంచి ప్రాధాన్యత వుంది. అజీర్ణ సమస్యలు తీర్చడంలో వాముది ప్రత్యేకమైన స్థానం.
రాక్ సాల్ట్‌తో కలిపి కొద్దిగా వామును తీసుకుని బాగా దంచి నోటిలో వుంచి దాని రసాన్ని మింగుతూ వుంటే.. కడుపు పట్టేసినట్లుండడం నుంచి ఉపశమనం లభిస్తుంది. దీని తర్వాత కొద్దిగా గోరు వెచ్చని నీటిని తాగాలి. దాంతో, త్రేన్పులు వచ్చి తిన్న ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. పొట్ట ఖాళీ అయిన ఫీలింగ్ కలుగుతుంది.
ఇలా చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు రావు సరి కదా.. మళ్లీ మళ్లీ అజీర్తి సమస్యలు రాకుండా వుండాలంటే.. ప్రతీరోజూ కొద్దిగా వాముని రాక్ సాల్ట్‌తో కలిపి తీసుకోవడం మంచిది. లేదంటే, మరిగించిన వాటర్‌లో వాము వేసి, ఆ నీటిని పరగడుపున తీసుకున్నా అజీర్తి సమస్యలు క్రమ క్రమంగా మాయమైపోతాయని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!