షేక్ జాబర్ అల్-అహ్మద్ వంతెన మూసివేత

- March 07, 2024 , by Maagulf
షేక్ జాబర్ అల్-అహ్మద్ వంతెన మూసివేత

కువైట్: కువైట్ స్పోర్ట్స్ డే కార్యక్రమాల సందర్భంగా మార్చి 9వ తేదీ (శనివారం) షేక్ జాబర్ అల్-అహ్మద్ వంతెన రెండు వైపులా తాత్కాలికంగా మూసివేయబడుతుంది. శనివారం తెల్లవారుజామున 2:00 గంటల నుండి సుబియా ప్రాంతం వైపు మరియు 7:00 నుండి కార్యకలాపాలు ముగిసే వరకు అల్-గజాలీ రోడ్ వైపు వంతెన మూసివేయబడుతుందని అధికారులు ప్రకటించారు. జనరల్ స్పోర్ట్స్ అథారిటీ మార్చి 9వ తేదీ శనివారం వంతెన వద్ద కువైట్ స్పోర్ట్స్ డే కార్యకలాపాలను నిర్వహించనుంది. ఈ సమయంలో వాహనదారులు ట్రాఫిక్ అధికారుల సూచనలను పాటించాలని , ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com