అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ గుడ్‌ న్యూస్‌

- March 08, 2024 , by Maagulf
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ గుడ్‌ న్యూస్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ నేడు దేశంలోని మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.100 మేర తగ్గించేందుకు నిర్ణయించామని ప్రకటించారు. ఈ నిర్ణయం భారతీయులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దేశంలోని నారీశక్తికి ఇది ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.

భారతీయ కుటుంబాల క్షేమం కోసమే గ్యాస్ సిలిండర్ ధరలను అందుబాటులోకి తెవడమే తమ లక్ష్యమని మోడీ పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్ (సులభతర జీవనం) నినాదానికి అనుగుణంగా గ్యాస్ ధరలు తగ్గించేందుకు నిర్ణయించినట్టు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com