హోమల్లో అస్థిర వాతావరణం.. అలర్ట్ జారీ
- March 08, 2024
మస్కట్: ఒమన్ సుల్తానేట్ గవర్నరేట్లలో అస్థిర వాతావరణం పరిస్థితులు నెలకొంటాయని సివిల్ ఏవియేషన్ అథారిటీ (సిఎఎ) తెలిపింది. దక్షిణ అల్ షర్కియా మరియు అల్ వుస్తా, అల్ హజర్ పర్వతాలు మరియు ముసండం, అల్ బురైమి, నార్త్ అల్ బతినా మరియు అ'దహిరా గవర్నరేట్లలో.. అలాగే అల్ హజర్ పర్వతాల వెంబడి వర్షాలు పడతాయని సివిల్ ఏవియేషన్ అథారిటీలోని వాతావరణ నిపుణుడు జైఫర్ హమద్ అల్ బుసైది వెల్లడించారు. ఈ అల్పపీడనం ఉరుములతో కూడిన (30 నుండి 60 మి.మీ.) వడగళ్ళు , చురుకైన గాలులతో ప్రారంభమవుతుందని, ఇది రేపు మధ్యాహ్నం నుండి దీని ప్రభావం అధికం అవుతుందని తెలిపారు. అల్ బతినా మరియు అల్ దఖిలియా, మస్కట్, నార్త్ అల్ షర్కియా మరియు సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లకు వ్యాపిస్తుందని అల్ వుస్తా మరియు ధోఫర్ గవర్నరేట్లలోని ఎడారి ప్రాంతాల్లో ఈదురు గాలులు వీస్తాయని అల్ బుసాయిదీ తెలిపారు. శనివారం ఉదయం అర్ధరాత్రి తర్వాత వాతావరణ పరిస్థితి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, శనివారం సాయంత్రం వరకు భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అల్ బుసైది సూచించారు. దీనితో పాటు లోయలు మరియు లోతట్టు ప్రాంతాలలో ఆకస్మిక వరదలు వస్తాయని , అలాగే వడగళ్ళు మరియు చాలా వేగంగా క్రిందిక వరకు గాలులు (25 నుండి 50 నాట్లు) వరకు చురుకుగా ఉంటాయని అల్ బుసైది వెల్లడించారు. ముఖ్యంగా ముసందమ్, అల్-దహిరా, అల్ బురైమి మరియు నార్త్ అల్ బతినా గవర్నరేట్లలో చెట్లు, విద్యుత్ స్తంభాలు మరియు అస్థిరమైన వస్తువులు నేలకూలడం అవకాశం ఉందని హెచ్చరించారు. దక్షిణ అల్ బతినా, మస్కట్, అ'దఖిలియా, నార్త్ అల్ షర్కియా మరియు సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లు చెదురుమదురు వర్షాలు, అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ళు మరియు చురుకైన గాలులు వీస్తాయని అల్ బుసైది తెలిపారు. అల్ వుస్తా మరియు ధోఫర్ గవర్నరేట్లలో చెదురుమదురు వర్షాలు (20 నుండి 50 మి.మీ) కురుస్తాయని, ఇది ఆదివారం సుల్తానేట్ ఆఫ్ ఒమన్ అంతటా అడపాదడపా కొనసాగుతుందని అల్ బుసైది వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష